కంగ్టి మండలంలో భూ రీ-సర్వేకు ఏర్పాట్లు
సిద్ధంగిర్గ,ఎంకేమూరి గ్రామాల్లో సర్వేకు సన్నాహాలు
కంగ్టి, నవంబర్ 2( విజయక్రాంతి): మండలంలోని సిద్ధంగిర్గ, ఎంకేమూరి గ్రామాల్లో(MK Muri villages) ప్రభుత్వ ఆధ్వర్యంలో భూముల రీ-సర్వే కార్యక్రమం(Land Re-survey Program) నిర్వహించనున్నట్లు ఎమ్మార్వో గంగభవాని(MRO Gangabhavani) ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు రీ-సర్వే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. భూ రీ-సర్వే ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.రీ-సర్వే పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే చెల్లించవద్దని,దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రీ-సర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.