దామరచర్ల మండల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
49 మంది లబ్ధిదారులకు రూ.49.05 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
దామరచర్ల :అక్టోబర్:16: దామరచర్ల మండలానికి చెందిన కళ్యాణలక్ష్మి పథకం(Kalyana Lakshmi Scheme) లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshma Reddy) స్థానిక నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.మండల పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు రూ.49 లక్షల 5,600 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్ర నాగు నాయక్ , తహసీల్దార్ జవహర్ లాల్, ఆర్ఐ సురేందర్ సింగ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు బెజ్జం సాయి, మాజీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, అంజిరెడ్డి, బంటు కిరణ్, రవితేజ నాయక్, సర్పంచులు నర్సిరెడ్డి, శంకర్ నాయక్, సిద్ధు నాయక్, సైదా నాయక్, కిరణ్ నాయక్, మాలోతు సైదా నాయక్, శ్రావణి, నాగు నాయక్, పార్వతి, లక్ష్మ నాయక్, బండవత్ నాగు నాయక్, రాము నాయక్, సుజాత, రవి నాయక్, పోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.