ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారం
దామరచర్ల : నవంబర్ :2 ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం తోనే పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshma Reddy) అన్నారు. దామరచర్ల మండలం లోని బెట్టేతండా లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ను సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన సొంత నివాసం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.ఇందిరమ్మ ఇళ్ల లో గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సైదా నాయక్ , మండల పార్టీ అధ్యక్షుడు నాగు నాయక్,సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు బి సాయి , కాంగ్రెస్ నాయకులు జి శ్రీనివాస్ పాల్గొన్నారు...