వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలి
- పేదల గుడిసెలను కూల్చుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి
- మాజీ ఎంపీ వినోద్ కుమార్
హనుమకొండ,నవంబర్ 02 (విజయ క్రాంతి): వైఎస్సార్ నగర్ గుడిసెవాసులు, నిరుపేదలకు పట్టాలు ఇచ్చి, పక్కా గృహాలు నిర్మించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్(Former MP Vinod Kumar) డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ(BRS Party), సీపీఎం(CPM), జనసేన(Jana Sena), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైయస్సార్ గుడిసే వాసులకు సంఘీబావంగా కాజీపేట లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలన్నారు.30 ఏండ్లుగా నివసిస్తున్న పేదలకు పక్కా ఇండ్లు కట్టించాలని, కేసీఆర్ హయాంలో పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చామని, పేదల గుడిసెలను కూల్చుతున్నవారిపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.
వైఎస్సార్ నగర్ గుడిసెవాసులు ఉంటున్న స్థలం వాస్తవంగా సీలింగ్ భూమని,సర్వే నంబర్ 70, 71, 72 భూమి విషయంలో రికార్డులు మారుతున్నాయని,అభికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలకు పట్టాలు, ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నారు.ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ పథకాల పేర్లు మార్చుడం కాదు, పేదల బతుకులు మార్చాలన్నారు. కాంగ్రెస్ నాయకులే గుడిసెలు వేయించి, నేడు అవే గుడిసెలను అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూల్చుతున్నాడని ఆరోపించారు. అనంతరం కాజీపేట తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో
సీపీఎం నాయకులు కారు ఉపేందర్, సాంబయ్య, జనసేనపార్టీ నేత మాదం పద్మజ, కేడల ప్రసాద్, మాదాసు సురేష్, నీరటి పావని, నార్లగిరి రమేష్, మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగ రావు, సోదా కిరణ్, తండమల్ల వేణు, జోరిక రమేష్, ఉడతల సారంగపాణి, వద్దిరాజ్ గణేష్, మేకల బాబురావు డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్, రంజిత్, పున్నం చందర్, దువ్వ కనకరాజు, కోటిలింగం, మనోజ్, కొండ శ్రీను, ఖలీల్, వైఎస్సార్ గుడిసెవాసులు, రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.