హెచ్‌ఐవీ నియంత్రణలో భూపాలపల్లికి గుర్తింపు
జిల్లాను సురక్షిత ప్లస్ స్థాయికి తీసుకెళ్లాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, నవంబర్ 02 (విజయ క్రాంతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణలో(HIV and AIDS Control) సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ జిల్లాను సురక్షిత ప్లస్ స్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) సూచించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో 95:95:95 లక్ష్యాలను సాధించి జిల్లా సురక్షిత జిల్లాగా గుర్తింపు పొందిన సందర్భంగా కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. హెచ్‌ఐవీపై అవగాహన, పరీక్షలు, చికిత్స సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, దిశ సీఎస్‌ఓ సారయ్య, డీఎంవీడీఓ సాయి, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.