ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: వాడపల్లి ఎస్ఐ ఎన్.ధర్మ

26-10-2026 | 10:28pm

దామరచర్ల: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని వాడపల్లి ఎస్ఐ ఎన్.ధర్మ(SI Dharma) అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో సోమవారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనదారులు వాహనాలను అతివేగంగా, రాంగ్ సైడ్ నడపడం తగదని చెప్పారు. మందు సేవించి, అజాగ్రత్తతో నడిపితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమో, అంగవికలాంగులు కావడం జరుగుతుందని చెప్పారు. వాహనదారులకే గాక వారి కుటుంబసభ్యులకు కూడా ఇబ్బందులు కలుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు