పచ్చి రొట్టె ఎరువుల సాగును ప్రోత్సహించాలి
మాగనూరు మండలం(నారాయణపేట): ఖేత్ బచావో అభియాన్(Khet Bachao Abhiyan) (సాగు భూమి సంరక్షణ కార్యక్రమం) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాగనూరు మండలం నేరడగమ్ము గ్రామ రైతు వేదిక లో(Neradagammu Village Farmers' Platform) రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ వ్యవసాయ భూముల సారవంతాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని వారు తెలిపారు.
అధిక రసాయన ఎరువులు వినియోగo తగ్గించి సేంద్రియ ఎరువులు మరియు పచ్చి రొట్టె ఎరువులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని వారు సూచించారు. నేలలో సేంద్రీయ కర్బనం శాతం పెరగడం వల్ల నేలలు నీటిని నిలువ చేసుకొని సామర్థ్యం పెరిగి సూక్ష్మజీవుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని వివరించారు.
పశువుల ఎరువులు, కంపోస్టు, పిచ్చి రొట్టె ఎరువులు వినియోగంతో నెలలో సేంద్రీయత కార్బనాన్ని పెంచుకోవచ్చని అన్నారు. అలాగే వరి కోత అనంతరం మిగిలిన పంట కొయ్యలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడంతోపాటు సేంద్రియ పదార్థాలు పోషకాలు తగ్గుతాయని ,వాయు కాలుష్యం కూడా ఏర్పడుతుందని వివరించారు.
పంటల అవశేషాలను కాల్చడకుండా భూమిలో కలిగే దుండడం లేదా కంపోస్ట్ గా మార్చి వినియోగించుకోవడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పంటల మార్పిడిలో భాగంగా వరి తరువాత శనగ, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల పంటలను సాగు చేయడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు రైతులకు అధనం ఆదాయము లభించే అవకాశం ఉందని తెలిపారు.
పప్పు జాతి పంటల వేర్లపై ఉండే రైజుబియం బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని స్త్రీకరించి నేల సారవతాన్ని పెంచడంలో సహాయ పడుతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులైన జీవామృతం, ఘనజీవామృతం తయారీ మరియు వినియోగం పై రైతులకు అవగాహన కల్పించారు.
స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నెలలో జీవో వైవిధ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని సూచించారు,. పంటల మార్పిడిని పాటిస్తూ సాగుభూమి సంరక్షణలో భాగస్వామి కావాలని మండల వ్యవసాయ అధికారి రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటమ్మ ,ఏఈఓ అనిల్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.