ఐక్యతను చాటి పార్టీని బలోపేతం చేయండి

30-10-2026 | 07:08pm
  1. పదవులు అలంకరణ కాకూడదు
  2. మండల ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

మానకొండూరు, అక్టోబర్ 30 (విజయక్రాంతి): విమర్శలు మాని, ఐక్యతను చాటి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి రవీంద్ర చారి, ఏఎంసీ అధ్యక్షులు రేవెల్లి రాజలింగం, ఉపాధ్యక్షులు రేమిడి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రేమిడి తిరుమల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్.

జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కనకం అశోక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ్ర సురేష్, నూతనంగా నియమింపబడిన సొసైటీ, మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన మానకొండూరులో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,సొసైటీ డైరెక్టర్లకు మండల ఎస్సీ సెల్ ప్రధానకార్యదర్శి కొండ్ర రాంబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

మానకొండూరు మండలంలో ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో సముచితమైన చోటు దక్కిందని, బాధ్యతలు గుర్తెరిగి పార్టీని బలోపేతం చేయాలని నూతనంగా నియమితులైన సభ్యులకు పార్టీ బాధ్యులు సూచించారు. మానకొండూరు ఏఎంసి కార్యవర్గ సభ్యులు కనకం అశోక్, రాపాక రాజేశ్వర్, ఎర్రోళ్ల కవిత, సొసైటీ కార్యవర్గ సభ్యులు, కనుకుంట్ల రామస్వామి, కొమ్మగల్ల స్వరూప,

గాలి మొగిలయ్య, కనుకం ఎల్లయ్య, సోమిడి మల్లయ్య, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చలిగంటి ఓదెలు, రామగిరి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కొండ్ర రాంబాబు, సహాయ కార్యదర్శి గోపాల రామచందర్ లకు కొండ్ర రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాలువాలు కప్పి, ఆత్మీయ సన్మానం అందించి జ్ఞాపకాలు బహుకరించారు.

ఈ సందర్భంగా మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం అసాంతం వేడుకగా, కన్నుల పండుగవ సాగింది. కార్యక్రమం హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు కొండ్ర రాంబాబు పేరు,పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు