దసరా వేళ అప్రమత్తంగా ఉండాలి: సీఐ నరేష్
భిక్కనూర్,(విజయక్రాంతి): దసరా పండుగ(Dasara festivities) సందర్భంగా ప్రజలు రద్దీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భిక్కనూర్ సీఐ జగడం నరేష్(Bhikkanoor CI Jagadam Naresh), ఎస్‌ఐ అనిల్ సూచించారు. మార్కెట్లు, దేవాలయాలు, జాతరలు, షాపింగ్ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు, నగదు, బంగారు ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని కోరారు. ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా లాక్ చేసి సురక్షిత ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలని తెలిపారు.
ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను బహిరంగంగా ఉంచవద్దన్నారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించకూడదని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అప్రమత్తతతో దసరాను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు.