మెట్రో లేదు.. ఇంటర్నెట్ లేదు..

11-10-2026 | 05:15am

ప్రయాణికుల అవస్థలు

  1. స్టేషన్లలోనే పడిగాపులు
  2. మండుతున్న ఎండలు
  3. నెట్ లేక పనిచేయని యూపీఐ

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: సీఈసీకి వ్యతిరేకంగా (Opposed to the CEC)సీజేపీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో 45 మెట్రో స్టేషన్లను అధికారులు మూసేశారు. ఇంటర్నెట్‌ను కట్ చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు మెట్రో స్టేషన్లను బంద్(Delhi Metro Stations Closed) పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం రాత్రి వరకు ఈ స్టేషన్లను మూసివేస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ.. ఎప్పటివరకు ఇది కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పైగా, ఇంటర్నెట్ కూడా కట్ అవడంతో ముఖ్యంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్ లేకపోవడంతో యూపీఐ ట్రాన్సాక్షన్లు పనిచేయడం లేదు. పైగా ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. వారణాసికి వెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. ఎండతాపం తాళలేక దుకాణంలో నిమ్మకాయ సోడా తీసుకొని తాగాడు. అయితే.. అందుకు డబ్బులు చెల్లించేందుకు యూపీఐలో ప్రయత్నించగా ఇంటర్నెట్ లేకపోవడంతో చెల్లింపులు జరగలేదు.

తాను పర్సు కూడా తెచ్చుకోలేదని, చేతిలో డబ్బులు లేవని, ఇంటర్నెట్ లేకపోవడంతో కనీసం సోడా డబ్బులు కూడా చెల్లించలేకపోతున్నానని అతడు ఆవేదన వెలిబుచ్చాడు. మరోవైపు తాను వెళ్లాల్సిన రైలు కూడా రద్దయిందని తెలిసి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ‘ఒకవైపు ఎండలు.. మరోవైపు రైళ్ల రద్దు.. మేం ఎక్కడికి పోవాలి.. మాకెందుకు ఈ గోస’ అని చాలా మంది ప్రయాణికులు తమ బాధను వెలిబుచ్చారు. రోజువారీ పనులకు వెళ్లేవారైతే మెట్రో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. 

మరిన్ని వార్తలు