ఉత్తరాఖండ్ ఆకాశంలో హెలికాప్టర్ మిస్సింగ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తున్న క్రమంలో శుక్రవారం హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా పోయింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల (Bad Weather) కారణంగా హెలికాప్టర్ అదృశ్యమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ జాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు (Search Operation) ప్రారంభించారు.
అయితే హెలికాప్టర్‌లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? చివరిసారిగా ఎక్కడ కనిపించింది? ప్రస్తుతం దాని పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. హెలికాప్టర్ ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.