హోర్ముజ్‌లో మైన్‌ను ఢీకొన్నఇంధన నౌక

12-10-2026 | 05:20am
  1. పేలిన మందుపాతర.. భారీమంటల్లో సూపర్ ట్యాంకర్ షిప్
  2. జలసంధిలో అనధికారిక మార్గంలో వెళ్తండగా ఘటన

టెహ్రాన్, అక్టోబర్ 11: ఇరాన్‌లోని హో ర్ముజ్ జలసంధి(Strait of Hormuz) నుంచి అనధికారిక మార్గం ద్వారా బయటకు వెళ్లే ప్రయత్నం లో మైన్‌ను ముడి చమురు సూపర్‌ట్యాంకర్(Oil Supertanke) ఢీకొన్నది. దీంతో మందుపాతర పేలడంతో నౌక భారీ మంటల్లో కాలిపోయింది. ఈ మేరకు ఆదివారం ఐఆర్‌జీసీ నేవీ తెలిపింది. ‘అనధికారికంగా, ప్రమాదకరమైన మార్గం ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నౌక మందుపాతరను ఢీకొన్నది.

దీంతో ఒక ముడి చము రు సూపర్ట్యాంకర్ మంటల్లో చిక్కుకుందని ఇస్లామిక్ రివల్యూషన్ గారడ్స్ కారప్స్ (ఐఆర్‌జీసీ) నావికాదళం తెలిపింది. ఆ ట్యాం కర్ జలసంధిని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు మైన్ ఢీకొనడంతో శక్తివంతమైన పేలుడు సంభవించిందని ఐఆర్జిసీ నావికాద ళ ప్రజా సంబంధాల కార్యాలయం తెలిపిం ది.

ప్రమాదానికి ముందు సూపర్‌ట్యాంకర్ తన నావిగేషన్, పొజిషనింగ్ వ్యవస్థలను నిలిపివేసిందని స్పష్టం చేసింది. తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలకు కనిపించేలా ఆ నౌక భారీ అగ్నిప్రమాదంలో కాలిపోతోందని ఆ ప్రకటన పేర్కొంది. హోర్ముజ్ జలసంధి భద్రత, నిబంధనలను ఉల్లంఘించే ఏ చము రు ట్యాంకర్‌కైనా భారీ అగ్నిప్రమాదం తప్పదని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.

వ్యూహాత్మక జలమార్గమైన హోర్ముజ్‌కు దక్షిణంగా ఉన్న ఒక ‘అక్రమ మార్గం‘ గుండా వెళ్ళడానికి ప్ర యత్ని స్తున్న ఒక భారీ ద్రవీకృత పెట్రోలి యం గ్యాస్ (ఎల్పీజీ) రవాణా నౌకపై ఐఆర్‌జీసీ నేవీ దాడి చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది.


మరిన్ని వార్తలు