సముద్రంలో ఐఫోన్లు, పర్‌ఫ్యూమ్‌లు

16-10-2026 | 05:05am

హోర్ముజ్‌లో సీమైన్‌ను ఢీకొన్న సింగపూర్ నౌక

ప్రమాదకరమార్గంలో ప్రయాణించిందన్న ఐఆర్జీసీ

దుబాయ్, అక్టోబర్ 15: హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz)లో సింగపూర్‌కు చెందిన జీఎఫ్‌ఎస్ ప్రై డ్ గిసెల్ కార్గోనౌక సీమైన్‌ను ఢీకొని మునిగిపోయింది. దీంతో కంటైనర్లలో ఉన్న సామాగ్రి సముద్రంపై తేలియాడుతోంది. కుప్పలు తెప్పలుగా తేలియాడుతున్న సామాగ్రిలో ఐఫోన్లు, లగ్జరీ పర్‌ఫ్యూమ్ బాటిళ్లు అనేక వస్తువులున్నాయి. చట్టవిరుద్ధమైన ప్రమాదకరమైన మార్గంలో నౌక ప్రయాణిస్తున్న క్రమంలో ఒమన్‌లోని ముసందమ్ ద్వీపకల్పంలో ఉన్న రాస్ అల్-షేక్ మసూద్‌కు వాయువ్యంగా 4 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కోర్ (ఐఆర్జీసీ) ప్రకటించింది.

ఈ నౌక దుబాయ్ నుంచి సరుకులను సింగపూర్‌కు తీసుకువెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు సింగపూర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ఇరా న్‌అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హోర్ముజ్ మార్గంలో వాణిజ్య నౌకలపై దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు జరిగిన 106 దాడుల్లో 24 మంది నావికులు మృతి చెందారు. అనౌక నౌకలకు భారీ నష్టం వాటిల్లింది.

మరిన్ని వార్తలు