సోనియా కొత్త పుస్తకంలో ఏముంది?

10-11-2026 | 11:09am

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ రచించిన కొత్త పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) మంగళవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ఉదయం 10 గంటల నుంచి పుస్తక దుకాణాల్లో పాఠకులకు అందుబాటులోకి వచ్చినట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ (HarperCollins) ప్రకటించింది. సోనియా గాంధీ జీవిత ప్రయాణం, ప్రేమ, అనుబంధాలు, భారతదేశంతో ఏర్పడిన ఆత్మీయ సంబంధం వంటి అంశాలకు ఈ రచనలో ప్రాధాన్యత ఇచ్చారు.

‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడటం నుంచి ఓ దేశంతో అనుబంధం పెంచుకోవడం వరకు సాగిన భావోద్వేగ ప్రయాణాన్ని వివరించారు. కొత్త దేశంలో జీవితాన్ని ప్రారంభించడం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడం, తన జీవితాన్ని కొత్తగా మలుచుకోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. భారత్‌తో తన అనుబంధం ఎలా బలపడింది? జీవితంలో ఎదురైన మార్పులు తనను ఎలా ప్రభావితం చేశాయి? దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి అవసరమైన ధైర్యం ఎలా వచ్చిందనే విషయాలను ఈ పుస్తకంలో వివరించినట్లు ప్రచురణ సంస్థ వెల్లడించింది.

వ్యక్తిగత జీవిత అనుభవాలతో పాటు భారతదేశంతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నంగా ఈ రచన నిలవనుంది. సోనియా గాంధీ కొత్త పుస్తకం విడుదల కావడంతో రాజకీయ, సాహిత్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆమె జీవిత ప్రయాణం, అనుభవాలు, భారత్‌తో ఏర్పడిన ఆత్మీయ బంధం గురించి తెలుసుకోవాలనుకునే పాఠకులకు ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉండనుంది. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పుస్తక దుకాణాల్లో అందుబాటులోకి వచ్చింది

మరిన్ని వార్తలు