కూల్‌డ్రింక్‌లో విషం కలిపి దారుణం
ఖమ్మం: వివాహేతర సంబంధం(Extramarital affair) ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తమ వ్యక్తిగత వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలుస్తుందనే భయంతో ఇద్దరు వ్యక్తులు కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన పదో తరగతి విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా(Khammam district)లో చోటుచేసుకుంది.
బాలుడికి తెలిసిన రహస్యమే కారణమా?
వివరాల్లోకి వెళ్తే.. అపర్ణ అనే మహిళ భర్తతో విడిపోయి కొల్లూరు మండలం చిన్నకొరుకొండ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి జిల్లెళ్ల రవి (15) చూసినట్లు తెలుస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతానని రవి హెచ్చరించడంతో ఇద్దరూ ఆందోళనకు గురైనట్లు సమాచారం.
కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి..
రవి తమ వ్యవహారాన్ని బయటపెడతాడనే భయంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిందితులు నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత నెల 24న గ్రామ శివారుకు తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: ఒకే షాపులో రెండోసారి చోరీ!
ఆ తర్వాత రవి ఆరోగ్యం క్షీణించడంతో నిందితులు భయాందోళనకు గురయ్యారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు అతడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రవి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
బాలుడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో అపర్ణ, అజయ్ పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అభం శుభం తెలియని ఓ బాలుడి ప్రాణాలు ఇలా బలవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.