సీఎంకు అపోలో టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్

10-11-2026 | 11:29am

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చైతన్యపురి అపోలో మెడికల్ అకాడమీ (Apollo Medical Academy) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి: హరీశ్ అడ్డాలో కవిత ఎంట్రీ..కొత్త గేమ్!

ఈ సందర్భంగా అపోలో మెడికల్ అకాడమీ చైర్మన్ పోసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ అల్వాల మధుసూదన్ సీఎంను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జ్ఞాపికను బహూకరించారు. ముఖ్యమంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు