కేకే కమిటీ కాలయాపన ఇంకెంతకాలం?
వెంకటాపూర్, నవంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో కేకే కమిటీ చేస్తున్న జాప్యం ఇంకెంతకాలమని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య ప్రశ్నించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో (Election Manifesto) పొందుపరిచిన హామీలను ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కమిటీలో ఆరుగురు సభ్యులున్నప్పటికీ భిన్నాభిప్రాయాలతో (Differences of Opinion) కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
ఉద్యమకారులు రోజురోజుకు ప్రాణాలు కోల్పోతున్నారని, మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం (Compensation), కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బతికున్న ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు, నెలకు రూ.25 వేల పింఛన్తో పాటు బస్సు, రైలు ప్రయాణ పాస్లు కల్పించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలు అమలు చేయాలని, లేనిపక్షంలో కమిటీ సభ్యుల ఇళ్ల ముట్టడి, చావుడప్పు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.