పెన్సిల్వేనియాలో కాల్పులు..9 మంది మృతి

11-10-2026 | 05:10am
  1. తనను తాను కాల్చుకున్న నిందితుడు?
  2. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

వాషింగ్టన్, అక్టోబర్ 10: అమెరికాలోని పెన్సిల్వేనియాలో(Pennsylvania) శనివారం సాయంత్రం జరిగిన కాల్పులలో ఇద్దరు పిల్లలతో సహా 9 మంది మృతి చెందారు. కాల్పుల శబ్దాలు విన్న కొందరు స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో భారీ ఎత్తున పోలీసులు ఘట నా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల ఘటన పెన్సిల్వేనియాలోని ఎరీ నగర కేంద్రంలోని ఫెర్రీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల రాకను గమనించిన నిందితుడు ఇంటిలోకి వెళ్లి తనను తాను కాల్చుకొని మృతి చెందాడని భావిస్తున్నారు.

పోలీసుల సోదాల్లో ఇం ట్లోని వారు కూడా మృతి చెందినట్లు గుర్తించారు. నిందితుడి ఇంటి బయట వీధిలో పలువురు మహిళల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇంటి నుంచి బయటికి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడని స్థానికులు మీడియాకు తెలిపారు.

వెంటనే పారిపోయి పోలీసులకు సమాచారం అందజేశామన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు ఎవరన్నదానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అమెరికా పోలీసుల నివేదిక ప్రకారం 24 సెప్టెంబర్ వరకు జరిగిన కాల్పుల ఘటనల్లో 320 మంది మృతి చెందారు.


మరిన్ని వార్తలు