చివరిదశకు తిరుమల బ్రహ్మోత్సవాలు

21-09-2026 | 07:46am

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు(Tirumala Brahmotsavam 2026) చివరిదశకు చేరుకున్నాయి. ఏడో రోజు ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి సూర్యానారాయణస్వామి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం భాగ్యం కలుగుతోంది.

గజ వాహన సేవ 

భక్తి, సాంస్కృతిక వైభవం, గోవిందా గోవింద(Govinda Govinda) నినాదాలతో పవిత్రమైన మాడవీధులు సజీవంగా మారడంతో దివ్య శోభతో అలంకరించబడిన శ్రీ మలయప్ప స్వామి, గంభీరమైన గజవాహనం నుండి భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

అటు తిరుమలతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల(Tirumala Tirupati Devasthanams ) వెంకన్న దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 72,019 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా,  25,431 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు