పాకిస్థాన్ చిత్తు.. క్వార్టర్‌ఫైనల్‌లో భారత మహిళల జట్టు
21-09-2026 | 08:41am
Asian Games 2026: భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు(Indian women's table tennis team) పాకిస్థాన్‌ను 3-0తో ఏకపక్షంగా ఓడించి గ్రూప్ ఎఫ్‌లో వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానానికి చేరుకుని సోమవారం జరిగిన ఆసియా గేమ్స్‌లో(Asian Games) క్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. స్కై హాల్‌లో, ఆదివారం జరిగిన తమ ప్రారంభ మ్యాచ్‌లలో ఇండోనేషియా, సింగపూర్‌లను ఓడించిన భారత్, తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై(India Beats Pakistan) కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. హంగ్జౌలో జరిగిన గత పోటీలలో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సుతీర్థ ముఖర్జీ, అలీనా ఖాన్‌ను కేవలం 10 నిమిషాల్లోనే 11-3, 11-3, 11-4 తేడాతో ఓడించి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.