భీకర యుద్ధం: 1600 డ్రోన్లతో రష్యాపై దాడి

21-09-2026 | 07:30am

మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) భీకరంగా మారింది. తాజాగా ఉక్రెయిన్(Ukraine attacks) మాస్కో ప్రాంతంపై డ్రోన్ల వర్షం కురిపించింది. 2022లో క్రెమ్లిన్ ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించినప్పటి నుండి మాస్కోపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని, దాడిలో సుమారు 1,600 డ్రోన్లు పాల్గొన్నాయని, వాటిలో 450 డ్రోన్లు నేరుగా రాజధానిని లక్ష్యంగా చేసుకున్నాయని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్(Moscow Mayor Sergei Sobyanin) తెలిపారు. ఈ డ్రోన్ల దాడుల్లో ఆయిల్ రిఫైనరీలు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమై భారీ నష్టం జరిగింది. ప్రస్తుతం ఉక్రెయిన్ దాడులకు సంబంధించిన చిత్రాలు, వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

అటు రష్యాదాడిలో నలుగురు మరణించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. దేశంలో పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజైన ఆదివారం నాడు మాస్కో, దాని పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో దాడి చేయడంపై ఆగ్రహించిన రష్యా కీవ్ (Kyiv) పై తమ దాడులను తీవ్రతరం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది."రష్యాలోని పౌర లక్ష్యాలపై కీవ్ పాలకవర్గం జరిపిన దాడులకు ప్రతిస్పందనగా, కీవ్‌లోని సైనిక లక్ష్యాలపై రష్యా సైన్యం తన అత్యంత కచ్చితమైన దాడులను కొనసాగిస్తూ, మరింత తీవ్రతరం చేస్తుంది," అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.


మరిన్ని వార్తలు