భారతీయులకు తప్పిన ప్రమాదం
మాస్కో: రష్యా–ఉక్రెయిన్(Russia Ukraine War) యుద్ధం మరింత భయానకంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ మరోసారి రష్యా భూభాగంపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు(Ukraine drone attack) పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా రష్యా రాజధాని మాస్కో, ఆయిల్ రిఫైనరీలు(Moscow oil refinery attack) లక్ష్యంగా దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 650 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో మాస్కోతో పాటు రష్యాలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు రష్యా తీర ప్రాంతమైన సోచిలోని ఆయిల్ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో ట్యాంకర్‌లో 23 మంది భారతీయ(Indian crew Russia) సిబ్బంది ఉన్నట్లు రష్యా అధికారులు తెలిపారు. అయితే వారందరినీ సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. దీంతో భారతీయ సిబ్బందికి పెను ప్రమాదం తప్పినట్లైంది. దాడుల తీవ్రత దృష్ట్యా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని రష్యా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, మాస్కో అటాక్, సోచి ఆయిల్ ట్యాంకర్ దాడి, భారతీయ సిబ్బంది భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.