ట్రంప్‌లో అ‘శాంతి’
- నోబెల్ దక్కనందుకు ఆక్రోశం
- ఐసీసీపై అమెరికా ఆంక్షలు, హెచ్చరికలు
- పనితీరు దెబ్బతీసే ప్రయత్నం: ఐసీసీ డిప్యూటీ ప్రాసిక్యూటర్ షమీమ్
వాషింగ్టన్, అక్టోబర్ 10: ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి(Nobel Peace Prize) లభించనందుకు ట్రంప్ మరోసారి ఏడుపు లంకించుకున్నారు. ఆయనలో అణువణువునా అ‘శాంతి’ నెలకొంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ మరోమారు తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపినందుకు 8సార్లు నోబెల్ రావాల్సి ఉందని, కానీ ఒక్కసారి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహుమతిని తనకు ప్రదానం చేయకుండా నార్వే ‘తనపై తాను కోలుకోలేని మచ్చను అంటించుకుందని’ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
ఈ నిర్ణయం సిగ్గుచేటైనదని, అవమానకరమైనదని మనసులోని బాధను వెళ్లగక్కారు. మరోవైపు శాంతి బహుమతి పిళ్లుకి ప్రదానం చేయడంతో అమెరికా ప్రభుత్వం ఐసీసీ (అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు)పై పలు ఆంక్షలు విధించింది. తమను కోర్టు బెదిరించడం ఆపాలని, నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేస్తారా? అని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో ఐసీసీని హెచ్చరించారు. ఐసీసీ కోర్టుకు అమెరికా చేస్తున్న ఆర్థిక సహాయాన్ని, కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.