అన్ని రకాల బంధాల నేపథ్యంలో సాగే ప్రేమకథ

27-09-2026 | 05:15am

హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌(High Joy Commercials banner)పై డా.చింతాడ హేమారావు నిర్మాతగా, వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చకోర: లూనార్ లవ్ బర్డ్’. శ్రవణ్, మలైకా టీ వాసుపల్‌ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ప్రేమకథ ఇది.

అనుష్క లూహార్, యామిని, ఎల్‌బీ శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం శ్రీ లక్ష్మిపిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూశాను. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. ఒక కొత్త తరహా ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నా” అన్నారు.

హీరో శ్రవణ్ మాట్లాడుతూ.. “ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటే మా సినిమాకు రావొచ్చు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకు మధ్య బాండింగ్, తల్లీ కొడుకు మధ్య అనుబంధం, స్నేహితుల మధ్య ఉంటే బాండింగ్, ప్రేమ జంట మధ్య ఉండే లవ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని తెలిపారు. హీరోయిన్ మలైకా టీ వాసుపల్ మాట్లాడుతూ.. “హీరోయిన్‌గా నా మొదటి తెలుగు సినిమా ఇది.

ఈ సినిమా యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే ఒక మంచి ఎంటర్‌టైనర్‌” అని తెలిపింది. డైరెక్టర్ మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. “పేరున్న హీరోలతో సినిమా చేయడం సులువుకాదు. అందుకే కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

వీరిద్దరు నేను అనుకున్న విజన్‌కు తగినట్లు మంచి పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. మా సినిమా ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతుందని నమ్ముతున్నాం” అన్నారు. నిర్మాత హేమారావు మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో ప్రేక్షకులు ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని ఒక కొత్త తరహా ప్రేమకథను చూస్తారు. సరికొత్త అనుభూతిని కలిగించే లవ్‌స్టోరీ ఇది” అని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజుతోపాటు మిగతా చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు