బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం
సెమీస్‌లో భారత పురుషుల జట్టు
నగోయా, సెప్టెంబర్ 22: ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు(Indian men's badminton team) కు పతకం ఖాయమైంది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న మెన్స్ టీమ్ సెమీఫైనల్స్‌కి(Semifinals) దూ సుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో జప్పా 3--0 తేడాతో ఘన విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ కోడై నారాకాపై 11--21, 21--5, 21--19 అద్భుతమైన విజయం సాధించి భారత్‌కు ఆధిక్యం అందించాడు. తర్వాత డబుల్స్ పోరులో సాత్విక్ సాయిరాజ్, చిరా గ్ శెట్టి 21--18, 24--22 తేడాతో తకురో హోకి, యుగో కొబయాషి జోడీపై గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించారు.
రెండో సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి కోకి వతనాబెపై 21-- 10, 21--19 విజయం సాధించి భారత్‌కు సెమీస్ బెర్త్ ఖాయం చేశాడు. మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో మాత్రం భారత్‌కు నిరాశే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో భారత మహిళల టీమ్(Indian women's team) ఓటమిపాలైంది. షూటింగ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా భారత్‌కు పతకం చేజారింది.