ఏఐతో టూరిజానికి కొత్త రూపు

27-09-2026 | 05:30am
  1. డిజిటల్ టెక్నాలజీ, ఏఐ వాడకాన్ని విస్తృతం చేయండి    
  2. తెలంగాణ పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు తేవాలి
  3. పీపీపీతో మౌలిక వసతులు, పెట్టుబడులకు ఊతం  
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  5. శిల్పారామంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

హైదరాబాద్/రంగారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను(Artificial Intelligence) విస్తృతంగా వినియోగించా లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సూచించారు. ప్రకృతి, చారిత్రక, ఆధ్యాత్మిక, సాం స్కృతిక సంపదకు నెలవైన తెలంగాణను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.

శనివారం హైదరాబాద్ శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్త రూపు’ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎంతో పాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మా ట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మన పర్యాటక రంగాన్ని పునర్ ని ర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రం లో హెల్త్, ఆలయ, గ్రామీణ, ప్రకృతి పర్యాటక రంగాలకు అపారమైన అవకాశాలు ఉ న్నాయని తెలిపారు. వికారాబాద్‌లో వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. టైగర్ రిజర్వులు, అడవు లు, జలపాతాలు, ప్రాచీన ఆలయాలు, నగరంలోని చారిత్రక కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. వీటిని అంతర్జాతీయంగా సరైన రీతిలో మా ర్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గతంతో పోలిస్తే ఈసారి పర్యాటక రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చామని, సందర్శకుల భద్రత, నాణ్యమైన వస తులకు తమ పాలసీలో పెద్దపీట వేసినట్లు చెప్పారు.

ప్రభుత్వ-,ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి హోట ళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి, భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని స్ప ష్టం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులను పర్యాటకం వైపు మళ్లించేందుకు వారాంతాల్లో ‘టూరిజం కూపన్లు’ అందించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ మంత్రి, కార్యదర్శి కలిసి ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు, పర్యాటక ప్రాజెక్టుల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం కావాలని ఆదేశించారు.  

నూతన కార్యక్రమాలకు శ్రీకారం

రీడిజైన్ చేసిన తెలంగాణ టూరిజం వెబ్‌సైట్, ఆన్‌లైన్ హోమ్ స్టే రిజిస్ట్రేషన్ విధా నం, కొత్త టూరిజం ట్రైలర్లు, ఇంటరాక్టివ్ ఏఆర్/వీఆర్ ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై కాఫీ టేబుల్ బుక్, మై తెలంగాణ, మై స్టోరీ, మై డెస్టినేషన్ అంశంపై వీడియో/పోస్టర్, ఎకో టూరిజంపై వీడియోను కూడా విడుదల చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు స మక్షంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండి యా సూపరింటెండెంట్ నిఖిల్ దాస్, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్ ఆధ్వ ర్యంలో తెలంగాణ ప్రభుత్వ పురావస్తు శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నా లజీ  ది ఫ్యూచర్ ఆఫ్ టూరిజం, ఎకో టూరి జం, ఫిల్మ్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, హెరిటేజ్ టూరిజం తదితర రంగాల్లో వస్తు న్న మార్పులు, అవకాశాలపై అంశంపై ప్యా నెల్ చర్చ నిర్వహించారు.

ఈ సదస్సులో యువ టూరిజం క్లబ్‌ల విద్యార్థులు, టూరిస్ట్ పోలీస్, తెలంగాణ దర్శిని, శిక్షణ పొందిన గైడ్స్, హోమ్ స్టే పై పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ఎక్సలె న్స్ అవార్డులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 


మరిన్ని వార్తలు