ఎర్రవల్లిలో వందల ఎకరాలు ఎలా వచ్చాయి?

16-09-2026 | 07:33pm

హైదరాబాద్: కల్వకుంట్ల భూదోపిడీని శాసనసభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చక్కగా వివరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యమాన్ని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని పదేళ్లు దోచుకుని దాచుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు(Former BRS Minister Harish Rao) ఎందుకు సమాధానం చెప్పలేదు? అని అడిగారు.  ఉద్యమ సమయంలో మీ కుటుంబానికి ఉన్న భూమి ఎంత?, ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు కుటుంబానికి ఉన్న భూమి ఎంత? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ భూమి గురించి ఎందుకు మాట్లాడరు.?, 22ఏ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ వేసి నెల రోజుల్లోనే పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఇల్లే లేదని హరీష్ రావు అంటున్నారని, నందినగర్ లో ఇల్లు ఉన్నది వాస్తవం కాదా..?, ఎర్రవల్లిలో వందల ఎకరాల్లో ఫాంహౌస్ ఉన్నది నిజం కాదా?, ఫామ్ హౌస్ భూమిలో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి మొత్తం 440 ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలని ఆది శ్రీనివాస్ అన్నారు.

మరిన్ని వార్తలు