క్షుద్రపూజల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి
- ఎన్‌హెచ్‌ఆర్‌సీలో హరీష్‌రావు ఫిర్యాదు
- 4 వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao)పై క్షుద్రపూజల(Occultism) ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ(Telangana DGP)కి జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) ఆదేశించింది. ఈ విషయాన్ని ఆయన తరఫున ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన న్యాయవాది కే రేవంత్(Revanth Reddy) బుధవారం మీడియాకు తెలిపారు. నాలుగువారాల్లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
క్షుద్రపూజల ఆరోపణలపై ఓయూ, వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశామని, డీజీపీ కార్యాలయంలో సైతం వినతిపత్రం సమర్పించినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలపై సామాన్యులకు ఒక న్యాయం, అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయమా? అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.