చాకలి ఐలమ్మ నివాళులర్పించిన అదనపు కలెక్టర్
10-09-2026 | 01:24pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం చాకలి ఐలమ్మ(Chakali Ilamma) చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్(Additional Collector) యువరాజ్ మర్మాట్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్, డిఆర్ఓ వేణు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అనిల్ మర్మాట్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నదీం మాజీద్, బీసీ సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.