మధిరకు మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

25-09-2026 | 05:02pm

మధిర ఏఎంసి చైర్మన్ బండారు నరసింహారావు.

ఎర్రుపాలెం సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి): మధిర(Madhira)కు ప్రభుత్వం మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును(Additional Junior Civil Judge Court) మంజూరు చేసిందని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు(Bandaru Narasimha Rao) పేర్కొన్నారు. మధిరకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేయడం పట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 200 సివిల్ అండ్ క్రిమినల్, అదనపు కోర్టులు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మధిరకు ఒకటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మధిరకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేయడం పట్ల కోర్టు మధిర బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చావలి రామరాజు, న్యాయవాది గంధం శ్రీనివాసరావు  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మధిరలో ఐదుకు చేరిన కోర్టుల సంఖ్య.

ప్రభుత్వం మధిరకు మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ మంజూరు చేయటంతో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుల సంఖ్య మూడుకు, మొత్తం కోర్టుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్, ఇప్పటికే ఉండగా  కొత్తగా మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు అయింది. ఇవి కాకుండా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్, సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ సబ్ కోర్ట్ ఇప్పటికే ఉన్నాయి. వీటితో కలిపి మదిరలో కోర్టుల సంఖ్య ఐదుకు చేరినట్లు అయింది.

మరిన్ని వార్తలు