బీఆర్ఎస్ లో చేరిన ఆదివాసీ నాయకులు, యువకులు

01-10-2026 | 10:43pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలం(Utnoor Mandal) దంతన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుగూడ, తాటిగూడ గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు(Adivasi Leaders), యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ(BRS Party ) ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్ కుటుంబంలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జాన్సన్ నాయక్  మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కీలకంగా పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.

ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని జాన్సన్ నాయక్ తెలిపారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజల పక్షాన నిలబడే బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు సముచిత గౌరవం కల్పిస్తూ, వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

చెరువుగూడ, తాటిగూడ గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నామని తెలిపారు. జాన్సన్ నాయక్  నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పనిచేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు