పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంపు

10-09-2026 | 05:30am
  1. మూడేండ్లుకు పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
  2. ఉద్యోగాలకు 16వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నిరుద్యోగుల(Unemployed)కు తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) శుభవార్త చెప్పింది. పోలీసు నియామకాల్లో(police recruitment) వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎస్‌ఐ ఉద్యోగాల(SI jobs)తో సమానంగా కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable candidates)కు మూడేళ్లు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి 32 ఏళ్లకు పెరిగింది.

జూలై 29న పోలీస్ ఉద్యోగాల(Police jobs)కు ప్రభుత్వం నోటిఫికేషన్‌ల(Notifications)ను జారీ చేసి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ చేపడుతోంది. ఈనెల 16 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది, ఈక్రమంలో అభ్యర్థులు వయోపరిమితి పెంచాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పోలీసు, ఫైర్, జైళ్లశాఖ, ఎస్‌పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు మూడేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే డ్రైవర్ పోస్టులకు మాత్రం వయోపరిమితి పెంచలేదు.

మరిన్ని వార్తలు