తెలంగాణ ధిక్కార స్వరం ఐలమ్మ
- ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
- మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వ రం, తెలంగాణ సోయికి నిలువెత్తు నిదర్శ నం.. చాకలి ఐలమ్మ అని మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) కొనియాడారు. రైతులు, సబ్బండ కులా ల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడమే ఐలమ్మకు నిజమైన నివాళి అని పేర్కొ న్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు.
నాటి భూస్వాములను ఎదురించిన ధిక్కార స్పూర్తి, నాటి చట్టాల పరిధిలో న్యాయస్థానంలోనూ పోరాడి గెలిచిన ప్రజాస్వామిక స్పూర్తి, ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయని తెలిపారు. ప్రజా ఆకాం క్షలకు వ్యతిరేకంగా సాగుతున్న, అస్తవ్యస్త పాలనా రాజకీయ పరిస్థితుల్లో ఐలమ్మ ప్రదర్శించిన ధీరత్వం యువతకు అనుసరణీయ మని స్పష్టం చేశారు. శాంతియుత పంథాలో తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో, ఐలమ్మ అందించిన స్పూర్తి ఇమిడి వున్నదని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, వారి జయంతిని అధికారింకగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని గుర్తు చేశారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో, మహిళలు శిశు సంక్షేమం, రైతాంగం సబ్బండ కులాల అభ్యున్నతికి అనేక పథకాలను అమలు చేశామని వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ, కులవృత్తులను పునరుజ్జీవింపచేసి, సబ్బండ కులాల ఆర్థిక, సామాజి క ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని గుర్తు చేశారు. అవి సాధించిన ఫలితాలు నేడు దే శానికే ఆదర్శంగా నిలిచాయని వివరించారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం : కేటీఆర్
భూమి, భుక్తి కోసం పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐల మ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. పేదలు, పీడిత ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూ ర్తిదాయకమని అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ఐలమ్మ జ యంతి వేడుకల్లో కేటీఆర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐల మ్మ పాత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ఐలమ్మ త్యాగాలను, సేవలను గుర్తించే విధంగా పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఆమె పేరు పెట్టడమే కాకుండా, ఆమె జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం : హరీశ్‌రావు
అణచివేతకు ఎదురొడ్డి, బహుజనుల హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ ధైర్యం, తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. వీరవనిత, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.