ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

25-09-2026 | 03:06pm

తాడ్వాయి,సెప్టెంబర్,25( విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట(Telangana Armed Peasant Struggle) వీరనారి చాకలి ఐలమ్మ(Heroic Woman Chakali Ailamma) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ... శనివారం వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి ఉన్నందున ఆమె జయంతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.అన్ని గ్రామపంచాయతీలు, మండల,జిల్లా స్థాయిలో అధికార పార్టీ నాయకులు, బీసీ సంఘం,రజక సంఘం సోదరులు జయంతి వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఐలమ్మ విగ్రహాలు ఉన్నచోట విగ్రహాలకు లేని చోట చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు