11 నెలల చిన్నారికి అన్యూరిజం శస్త్రచికిత్స
29-09-2026 | 05:05am
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్‌లో(Medicover Hospitals) 11 నెలల చిన్నారికి మెదడులోని(Brain) ఏసీఏ రక్తనాళంలోని అరుదైన అన్యూరిజంకు(Aneurysm) క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పేరెంట్ అర్టెరీని మూసివేయకుండా మైక్రో సర్జికల్ క్లిప్పింగ్ అండ్, రీ కన్‌స్ట్రక్షన్ ద్వారా అన్యూరిజాన్ని సరిచేశారు. అదనంగా ఈడా మ్స్ విధానాన్ని కూడా నిర్వహించారు. డా. ఎస్. రమేష్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఆధ్వర్యంలో డా. దీపా ధరనప్ప షెట్టి (సీనియర్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, పీడియాట్రీషియన్), డా. శ్రీనివాస్ (హెచ్‌వోడీ అనెస్థిషియాలజీ), డా. కె. ప్రదీప్ (అనెస్థిషియాలజీ) తదితరుల సమన్వయంతో చికిత్స అందించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి కోలుకుని స్థిరమైన ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది.