అంగన్వాడి కార్యకర్త కూతురుకు ఎంబీబీఎస్
17-09-2026 | 07:11pm
తాంసి/భీంపూర్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భీంపూర్ మండలం(Bheempoor Mandal) గోముత్రి గ్రామానికి చెందిన ఆంగన్వాడి కార్యకర్తత కామన్వార్ కవిత, సురేశ్ దంపతుల కూతురు సృష్టి నీట్ లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందింది. ఈ సందర్భంగా గురువారం గ్రామస్తులు సృష్టి, తలిదండ్రులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్ల పుష్పలత, నాయకులు శేఖర్, మల్లేష్, నారాయణ ఆశాకార్యకర్తలు ఉన్నారు.