4 September, 2026 | 10:42 PM

Breaking News

శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •  

తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

15-05-2026 | 08:23pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్‌పేట తెలంగాణ మోడల్ స్కూల్,జూనియర్ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి గంటల ప్రాతిపదికన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లీష్) పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.రాంప్రసాద్ తెలిపారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ఇంగ్లీష్ బోధన నిర్వహించేందుకు ఇంగ్లీష్‌లో ఎంఏతో పాటు బిఎడ్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌తో పాటు విద్యార్హతలు, అనుభవ సర్టిఫికెట్ల ప్రతులను ఈ నెల 20వ తేదీలోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు 9వ లేదా 10వ తరగతి విద్యార్థులకు డెమో క్లాస్ నిర్వహించాల్సి ఉంటుందని, డెమో క్లాస్ తేదీని ముందుగానే తెలియజేస్తామని తెలిపారు.ఎంపికైన అభ్యర్థికి ప్రతి పీరియడ్‌కు రూ.182 వేతనం చెల్లించనున్నట్లు ప్రిన్సిపాల్ రాంప్రసాద్  వెల్లడించారు.