15 May, 2026 | 9:15 PM

బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

15-05-2026 08:21 PM

మంథనిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గణేష్ డిమాండ్

మంథని,(విజయక్రాంతి): మంథని మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్అ మాట్లాడుతూ కేంద్ర హోం సహాయ  మంత్రి బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ్ పై గతం వారం రోజుల క్రితం ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం జరిగిందని, వారం రోజులు గడుస్తున్న ఇప్పటివరకు భగీరథ్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని వారు ప్రశ్నించారు.

అధికారం, ధన బలాన్ని ఉపయోగించి కేంద్రమంత్రి కొడుకును కాపాడే ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. అదే సామాన్యుడైతే ఇదివరకే జైల్లో పెట్టేవారని,  సామాన్య మానవుడికి ఒకన్యాయం అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి  కొడుకకు ఒక న్యాయమ అని  ప్రశ్నించారు. గతంలో కూడా బండి భగీరథ్ మహేంద్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ చేయడం డ్రగ్స్ సేవించడం లాంటి సంఘటనలు ఉన్నాయని, అయినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంతోనే మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు.

ఇప్పటికైనా వెంటనే బండి భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అలాగే తన కుమారుడు చేసిన దుర్మార్గమైన చర్యకు  నైతిక బాధ్యత వహిస్తూ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు భగీరథ్ పై చర్యలు తీసుకోవాలని లేకుంటే సిపిఎం ప్రజా సంఘాల  ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ల సందీప్, గొర్రెంకల సురేష్, మంథని లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.