ప్రజావాణికి 13 దరఖాస్తులు..

21-09-2026 | 06:21pm

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన నేటి ప్రజావాణికి వివిధ శాఖలకు చెందిన మొత్తం 13 దరఖాస్తులు అందాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖలకు వాటిని పంపించి పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.

రామాయంపేట, సెప్టెంబర్ 21:(విజయ క్రాంతి): ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన నేటి ప్రజావాణి కార్యక్రమానికి(Public service program) మొత్తం 13 దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులను కలిసి తమ వినతిపత్రాలను అందజేశారు.

స్వీకరించిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 4, మున్సిపాలిటీకి 3, విద్యుత్ శాఖకు 2, ఎస్సీ కార్పొరేషన్‌కు 1, ఇందిరమ్మ ఇళ్లకు 1, పోలీస్ శాఖకు 1, పంచాయతీరాజ్ శాఖకు 1 దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు