ముగ్గురు రైస్ మిల్లర్ల అరెస్టు

08-09-2026 | 05:05am
  1. 6.79 కోట్ల ధాన్యం స్వాహా చేసిన యజమానులు
  2. సివిల్ సప్లయ్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసుల విచారణ
  3. మహబూబాబాద్ జిల్లాలో ఉదంతం

మహబూబాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) 2023-24కి సీఎంఆర్ కార్యక్రమంలో(CMR Program) బియ్యం పట్టించి ఇవ్వడానికి మిల్లర్లకు ఇచ్చిన ధా న్యంలో రూ.6.79 కోట్ల విలువైన 2,475.3 66 మెట్రిక్ టన్నుల ధాన్యం(Grain) స్వాహా ఘటనలో కొత్తగూడ, గంగారం మండలంలోని ముగ్గురు రైస్ మిల్లర్లపై జిల్లా సివిల్ సప్లయ్(District Civil Supplies) మేనేజర్ నరసింహారావు పోలీసులకు ఫిర్యా దు చేయగా,  మిల్లర్లను పోలీసులు అరెస్ట్(Police arrest) చేశారు.

జిల్లాలోని కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో నరసింహస్వామి ట్రేడర్స్, కొత్తగూడలో ఈశ్వర్ ట్రేడింగ్ కంపెనీ, గం గారం మండలం కామారంలో యాకుబ్ అ లీ బిన్నీ రైస్ మిల్లుల్లో మిషన్ కే 100 కార్యక్రమంలో భాగంగా అధికారులు తనిఖీలు చేశారు.  సివిల్ సప్లయ్ శాఖ కేటాయించిన ధాన్యానికి, సీఎంఆర్ కింద ఇ చ్చిన బియ్యం తో పోలిస్తే 6.79 కోట్ల విలువైన ధాన్యం క్షేత్రస్థాయిలో లేదని గుర్తించారు. సివిల్ సప్లై శా ఖ డీఎం ఫిర్యాదు మేరకు ముగ్గురు రైస్ మి ల్లర్లు పద్మ, వినయ్ కుమార్, యాకుబ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు గూడూరు సీఐ వినయ్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు