డయల్ యువర్ డీఎం
01-10-2026 | 09:41pm
ఆసిఫాబాద్ డిపో మేనేజర్‌కు నేరుగా ఫిర్యాదులు, సూచనలు
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రయాణికులకు అందుతున్న ప్రజా రవాణా సేవలకు సంబంధించిన సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లేందుకు అక్టోబర్ 2న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం(Dial Your DM Program) నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ కేవీ రాజశేఖర్(Asifabad Depot Manager K.V. Rajashekhar) తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను 9493282510 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.