వారంపాటు అసెంబ్లీ
- బీఏసీ సమావేశంలో నిర్ణయం
- భేటీకి బీఆర్‌ఎస్ దూరం
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) వారం రోజులపాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(Business Advisory Committee) (బీఏసీ)లో నిర్ణయించింది. సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌బిన్ బలాలా, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి హాజరయ్యారు.
సమావేశానికి బీఆర్‌ఎస్, సీపీఐ హాజరుకాలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు బీఏసీ ఆమోదం తెలిపింది. 22ఏ పై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు పెంచాలనే డిమాండ్ రాగా, మరోసారి బీఏసీ సమావేశం జరపాలని నిర్ణయించారు.
