గర్భ నిరోధక పద్ధతిపై అవగాహన

27-09-2026 | 05:10am

మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రోగ్రాం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): గర్భనిరోధకం అనేది కేవలం గర్భ ధారణను నివారించడం మాత్రమే కాకుం డా మహిళల ఆరోగ్యం, భవిష్యత్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడంలో కూ డా కీలక పాత్ర పోషిస్తుందని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్(Medicover Women & Child Hospital), హైటెక్ సిటీ వైద్యులు తెలిపారు. ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీనియర్ గైనకాలజి స్టులు మాట్లాడుతూ.. ప్రతి మహిళ తన ఆ రోగ్య పరిస్థితి, కుటుంబ ప్రణాళికలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా గర్భనిరోధ క పద్ధతిని ఎంపిక చేసుకోవాలని సూచించారు.

సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డా. రాధిక మాట్లాడుతూ, కాపర్-టీ, హార్మోనల్ ఐయూడీ, ఇంప్లాంట్లు, మాత్రలు, ఇంజెక్షన్లు, కండోమ్స్ వంటి అనేక సురక్షితమైన గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డా. వరలక్ష్మి మాట్లాడుతూ, గర్భనిరోధకం కుటుంబ నియంత్రణకు మాత్రమే కాకుండా అనుకోని గర్భధారణలు, కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డా. శ్రీవత్స, రీజినల్ మెడికల్ డైరెక్టర్, సుమ న్, సెంటర్ హెడ్, డా. స్వాతి, మెడికల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు