4 September, 2026 | 12:22 AM

లోక్ అదాలత్‌పై అవగాహన పెంచాలి

03-09-2026 | 11:18pm

- జడ్జి స్వరూప కాటం

ఇల్లెందు,(విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలత్‌(National Lok Adalat)ను విజయవంతం చేసేందుకు రాజీ పడదగిన కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం(Principal Junior Civil Judge Swaroop Katam) సూచించారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో గురువారం స్థానిక కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇల్లందు కోర్టు(Yellandu court) పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ పడదగిన కేసులను పెద్ద ఎత్తున పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్ అదాలత్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోర్టు సూపరింటెండెంట్ రామకృష్ణ, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.