3 September, 2026 | 11:57 PM

ఏడుపాయల టీ జంక్షన్‌లో ‘వన దుర్గ ట్రేడర్స్’ ప్రారంభం

03-09-2026 | 11:23pm

కొల్చారం: మెదక్ జిల్లా( Medak District) కొల్చారం మండల పరిధిలోని ఏడుపాయల టీ జంక్షన్ వద్ద వన దుర్గ ట్రేడర్స్ నూతన గ్రానైట్ షాపు(Vana Durga Traders new granite shop)ను మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన షాపు ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(MLA Thanneeru Harish Rao), నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి(Sunitha Lakshma Reddy) ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

షాపులో ఏర్పాటు చేసిన వివిధ రకాల గ్రానైట్ టైల్స్, మార్బుల్స్, ఫ్లోరింగ్ మెటీరియల్‌ను వారు పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు, సునీత లక్ష్మారెడ్డిలను షాపు యజమానులు బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్థానికంగా ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు ప్రజలకు అందించాలని సూచించారు. వ్యాపారంలో పారదర్శకత పాటించి వినియోగదారుల నమ్మకాన్ని పొందాలని అన్నారు. షాపు నిర్వాహకులు ముత్యం గారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తమ వద్ద అన్ని రకాల బ్రాండెడ్ గ్రానైట్, టైల్స్, శానిటరీ సామాగ్రి ఒకే చోట లభిస్తాయని తెలిపారు. కస్టమర్లకు నచ్చిన డిజైన్లతోపాటు ప్రజలకు అనుకూలమైన ధరలకు నాణ్యమైన వస్తువులను అందజేస్తామని చెప్పారు.