‘ఎన్డీసీసీ’ రూ.100 కోట్ల డిపాజిట్లు
మరో మైలురాయిని అధిగమించిన బ్యాంక్
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్(Nizamabad District Cooperative Central Bank Limited) (ఎన్డీసీసీబీ) ప్రధాన కార్యాలయం రూ.100 కోట్ల డిపాజిట్ల(Deposits) మైలురాయిని అధిగమించిన సందర్భంగా బ్యాంకు సీఈఓ నాగభూషణం వందే ప్రధా న కార్యాలయ సిబ్బందిని అభినందించారు. కేక్ కట్ చేసి ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. నాగభూషణం వందే మాట్లాడు తూ.. ప్రధాన కార్యాలయ సిబ్బంది సమష్టి కృషి, ఖాతాదారుల(Customers) నమ్మకం, సహకారంతో ఈ మైలురాయిని సాధించడం జరిగిందని తెలిపారు.
104 సంవత్సరాలకు పైగా ప్రజలకు విశ్వసనీయమైన సేవలు అందిస్తున్న ఎన్డీసీసీ బ్యాంకుపై ఖాతాదారులు ఉంచుతున్న నమ్మకమే ఈ విజయానికి ప్రధాన బలమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న ‘సంపద’ డిపాజిట్ పథకం ద్వారా సాధారణ ఖాతాదారులకు 8%, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీ అందిస్తున్నామని, ఈ పథకాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సీఈఓ తెలిపారు. ఈ విజయానికి సహకరించిన ప్రధాన కార్యాలయ సిబ్బంది, అధికారులు మరియు ఎన్డీసీసీ బ్యాంకుపై నమ్మకంతో తమ డిపాజిట్లను ఉంచిన ఖాతాదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.