ఇంట్లోకి చొరబడి బాలికతో అసభ్య ప్రవర్తన

10-09-2026 | 05:10am

పోక్సో కేసులో యువకుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

ఉప్పల్, సెప్టెంబర్ 9(విజయక్రాంతి) : ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని ఉపయోగించుకుని మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు (Sent to remand) పంపారు. ఉప్పల్ పోలీసులు తెలపిన వివరాల ప్రకారం, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రామంతాపూర్కు చెందిన నమల ఫణి (23) అనే యువకుడిపై కేసు నమోదు చేశారు.

ఇటీవల వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామానికి వెళ్లిన బాధితురాలి తల్లి తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో, నిందితుడు అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించి ఆమె మైనర్ కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించింది.

తల్లి అడ్డుకున్నప్పటికీ నిందితుడు బాలికతో అమర్యాదకరంగా ప్రవర్తించడమే కాకుండా, ప్రశ్నించిన తల్లిని అసభ్య పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడిని రిమాండ్కు పంపింది.


మరిన్ని వార్తలు