25 July, 2026 | 10:49 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఆపరేషన్ చేసి కణితిని బయటకు తీసిన డా. భద్రాచలం ఎంఎల్ఏ

14-07-2024 09:04 PM

భద్రాచలం: కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రెండు గంటల పాటు శ్రమించి కడుపులోని కణితిని ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ ఘటన నిఖిత హాస్పిటల్ లో ఆదివారం చోటుచేసుకుంది. భద్రాచలం నియోజక వర్గంలోని ఆలుబాక గ్రామానికి చెందిన సిహెచ్ కుమారి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. చికిత్స కొరకు నిఖిత హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. ఆమె వైద్యులు స్కానింగ్ తీసి ఎనిమిది కిలోల కణితి గడ్డ ఉందని తెలిపారు.

వెంటనే ఆపరేషన్ చేసి తీయాలని లేదంటే ప్రాణానికి ప్రమాదం ఉందని వెల్లడించారు. నిఖిత హాస్పిటల్ వైద్యులు భద్రాచలం నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, హాస్పిటల్ బృందం రెండు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి కడుపులోని కణితిని బయటకు తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలియజేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కణితిని బయటకు తీసీ ప్రాణాలతో కాపాడినందుకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.