పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి అర్హుడినీ ఓటరుగా నమోదు చేయించాలి

01-10-2026 | 10:27pm

- ఎమ్మెల్సీ అంజిరెడ్డి

హనుమకొండ,(విజయ క్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduates MLC elections) ప్రతి అర్హుడినీ ఓటరుగా నమోదు చేయించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బ్యాంక్వేట్ హాల్‌ లో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి  ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy), జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎంపీ  బూర నర్సయ్య గౌడ్ హాజరై కార్యకర్తలకు, నాయకులకు రాబోయే ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలోపేతానికి పట్టభద్రుల ఓటు హక్కు కీలకమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడినీ ఓటరుగా నమోదు చేయించేందుకు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకురాలు రావు పద్మ రెడ్డి, పరకాల నియోజకవర్గ అభ్యర్థి డా. పగడాల కాళీప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, నాయకులు డా. వన్నాల వెంకటరమణ, నెమ్మని మహేష్, మాజీ కార్పొరేటర్లు  చాడ స్వాతి రెడ్డి, దాస్యం అభినవ్ భాస్కర్, డా. పెసరు విజయ్ చందర్ రెడ్డి, దొంతి దేవేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్. పి. జయంత్ లాల్, సండ్ర మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు