రైతుల హామీల అమలుకు బీజేపీ కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర

27-09-2026 | 02:42pm

బోధన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): బోధన్ పట్టణలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి జగిత్యాల వరకు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) హాజరై యాత్రను ప్రారంభించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజల ముందుంచడానికే సైకిల్ యాత్ర నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మర్చిపోయిన కాంగ్రెస్ మోసాలను ప్రజల ముందుంచడానికే బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు సైకిల్ యాత్ర చేస్తున్నట్లు ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ కిసాన్ మోర్చా సైకిల్ యాత్రను బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన బోధన్ లో ప్రారంభించారు. ఈ యాత్ర బోధన్ నుంచి జగిత్యాల వరకు 320 కి.మీ. మేర ఉంటుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు